Tollywood: నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్..

సినీరంగంలో లవ్, డేటింగ్, బ్రేకప్ కామన్. ఇదివరకు చాలా మంది తారల రిలేషన్ షిప్ గురించి రకరకాల ప్రచారాలు నడిచాయి. అలాగే కొందరి ప్రేమకథలు వివాదాస్పదంగా ముగిసాయి. తమ ప్రియుడు/ప్రియురాలి గురించి అనేక ఆరోపణలు చేస్తూ విడిపోయారు. ఇప్పుడు తాజాగా మరో నటుడు తన ప్రియురాలి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్..
Karan Wahi

Updated on: Jul 23, 2026 | 12:48 PM

హిందీ బుల్లితెరపై నటుడు కరణ్ వాహి చాలా ఫేమస్. ఎన్నో సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో అతడు మాట్లాడుతూ.. ఆధునిక సంబంధాలు, మహిళా స్వేచ్ఛా గురించి అనేక కామెంట్స్ చేశారు. డేటింగ్‌లో మారుతున్న పోకడలు, సంబంధాల పట్ల కొత్త విధానాల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. అతడు ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఒకేసారి ఒక వ్యక్తితో మాత్రమే రిలేషన్ షిప్ లో ఉండాలనుకునేవాడినని.. ఒకేసారి చాలా మందితో డేటింగ్ చేయడం చాలా గందరగోళంగా ఉంటుందని అన్నారు. అయితే గతంలో తాను ప్రేమిస్తున్న ఒక అమ్మాయి.. అదే సమయంలో మరి కొందరితో డేటింగ్ చేసిందని అన్నారు. ఆ విషయం తర్వాత తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..

ఆ రిలేషన్షిప్ తనను చాలా ప్రభావితం చేసిందని కరణ్ వాహి అన్నారు. అయితే అతడి మాటలపై విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. దీంతో అతడు తన మాటలను సరిచేస్తూ తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని.. అయితే ఇలాంటి పరిస్థితిలు ఎలా ఎదుర్కొవాలి.. రిలేషన్ షిప్ ఎక్కడ్ బ్రేక్ చేయాలో అర్థం చేసుకోవడం కష్టమని అన్నారు. తాను తన వ్యక్తిగత ఆలోచన మాత్రమే పంచుకున్నానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

కరణ్ వాహి పాడ్‌కాస్ట్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ఆ స్టార్‌ను విమర్శించారు. పాత తరాల మహిళలు సంక్షోభాలను మౌనంగా భరించారనే .. కానీ ప్రస్తుత మహిళలు తన స్వరాన్ని ఎంతో ధైర్యంగా వివరిస్తున్నారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

 

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

Loading...
Unable to load recommendations.
Follow Us