Trivikram Srinivas : నందమూరి నటసింహంతో మాటల మాంత్రికుడు సినిమా చేయనున్నారా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. హీరోలను అభిమానులకు ఎలా కావాలో అలా చూపించడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు

Trivikram Srinivas :  నందమూరి నటసింహంతో మాటల మాంత్రికుడు సినిమా చేయనున్నారా..?
Trivikram

Edited By:

Updated on: Jul 21, 2021 | 11:55 AM

Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. హీరోలను అభిమానులకు ఎలా కావాలో అలా చూపించడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు గురూజీ. మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. గతంలో మహేష్ తో రెండు సినిమాలు చేశాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలు థియేటర్స్ లో అంతగా ప్రభావం చూపకపోయినప్పటికీ టీవీలో మాత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఇప్పుడు ప్రసారమైన మంచి టీఆర్పీని సొంతం చేసుకుంటాయి. దాంతో ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇటీవల బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎక్కువ సినిమాలు చేశారు. దాంతో బాలయ్యను కూడా గురుజీనే డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే బాలయ్య తో సినిమా చేయడానికి అనిల్ఈ రావిపూడి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత హాసిని హారిక బ్యానర్ లో బాలయ్య సినిమా ఉండనుంది. మరి ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదానిపై త్వరలోనే  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rakul Preet Singh: హాటెస్ట్ ఫిట్నెస్ ఫ్రీక్… జిమ్ లో చెమట్లు చిందిస్తోన్న అందాల రకుల్.. వీడియో వైరల్

Krithi Shetty : ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న అందాల కృతి .. ఆ హీరో సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసిందట.

అదంటేనే భయమేస్తోంది.. ప్లీజ్ వాటినెవరూ టచ్ చేయోద్దంటోన్న గ్లోబల్ స్టార్!

Loading...
Unable to load recommendations.
Follow Us