Actress Trisha: జయలలిత పాత్రలో త్రిష.. ఆ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో బ్యూటీ క్వీన్.. నిజాలు చూపిస్తారా?

మొదట వెండితెరపైనా ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ సత్తా చాటిన ఓ ప్రముఖ నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో త్రిష నటించనుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఆమెతో చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

Actress Trisha: జయలలిత పాత్రలో త్రిష.. ఆ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో బ్యూటీ క్వీన్.. నిజాలు చూపిస్తారా?
Actress Trisha

Updated on: Oct 31, 2026 | 6:15 AM

సౌతిండియన్ బ్యూటీ త్రిష కృష్ణన్ వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె సినిమాల గురించికాకుండా ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సీఎం విజయ్ తో త్రిష ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారన్న వార్తలు ఆ మధ్యన హాట్ టాపిక్ గా మారాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు త్రిష పేరు మరోసారి మార్మోగుతోంది. అదేంటంటే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎం.జి. రామచంద్రన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌లో, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను త్రిష పోషించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ‘పురచీ తలైవర్ ఎంజీఆర్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో ఎంజీఆర్ సినీ జీవితం, అలాగే రాజకీయ జీవితంలోనూ ఆయన ఎదుర్కొన్న ఆటు పోట్లను చూపించనున్నారు. కాగా ఎంజీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో జయలలితది కీలక పాత్ర. ఆమె కూడా వెండితెరపైనా ఆపై రాజకీయ రంగంలోనూ సత్తా చాటారు. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా ఎదిగారు. ఈ క్రమంలో సవాళ్లతో కూడిన ఈ పాత్ర కోసం త్రిషను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం చర్చలు జరుపుతోందని అంటున్నారు.

ఈ బయోపిక్‌లో ఎంజీఆర్, జయలలిత మాత్రమే కాకుండా, సి.ఎన్. అన్నదురై, ఎం. కరుణానిధి వంటి తమిళనాడు రాజకీయాల్లోని ప్రముఖులు కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను జె.ఎం. బషీర్ పోషిస్తున్నారు. చెన్నైలోని రామపురంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్రిష జయలలిత పాత్రను అంగీకరిస్తే, సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం లేదు. అయితే, ఈ నటీనటుల ఎంపికకు సంబంధించి చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. చర్చలు తుది దశలో ఉన్నాయి, ఈ శక్తివంతమైన పాత్రకు త్రిష అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి. ఇక ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం, చిత్ర నిర్మాణ సంస్థ, నిర్మాత,దర్శకుడు తదితర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇక ఇప్పటికీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో త్రిషకు మంచి డిమాండ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, అజిత్ కుమార్, వంటి స్టార్ నటులతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. చిరంజీవితో కలిసి ఆమె నటించిన విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us