
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్. మరీ ముఖ్యంగా రాకీ భాయ్ గా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు యశ్. అయితే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల కంటే ముందే కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు రాకింగ్ స్టార్. కన్నడ నాట అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక కేజీఎఫ్ 2 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ అంటూ మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వచ్చాడు. బుధవారం (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో యశ్ పేరు మరోసారి మార్మోగుతుంది. సోషల్ మీడియాలో ఈ రాఖీ భాయ్ కు సంబంధించిన పోస్టులు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇదే క్రమంలో హీరో యశ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
కాగా యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ‘యశ్’గా మార్చుకున్నారు. తండ్రి అరుణ్ కుమార్ బెంగళూరులో బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. తల్లి పుష్ప గృహిణి. ఇక యశ్ పెద్దగా చదువుకోలేదు. డిగ్రీలో చేరినప్పటికీ, సినిమా ప్రయత్నాల కోసం డ్రాప్‌అవుట్ అయ్యారు. నటనపై ఆసక్తి ఉండడంతో మొదట రంగస్థలంపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు యశ్. అక్కడ రంగస్థల నటులకు టీలు అందిస్తూ రోజుకు రూ.50 వేతనం అందుకున్నారు. ఆ తర్వాత ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.2007లో వచ్చిన ‘జంబద హుడుగి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ‘మొగ్గిన మనసు’తో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ‘గూగ్లీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’లతో కన్నడలో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇక కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
కాగా సినిమాల్లోకి రాక ముందు ‘ఉత్తరాయణ’, ‘నంద గోకుల’ తదితర టీవీ సీరియల్స్‌లో నటించాడు యశ్. ఇదే క్రమంలో రాధికా పండిట్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా చిగురించింది. ఐదేళ్లు ప్రేమించుకున్న యశ్- రాధిక పెద్దల అనుమతిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ పిల్లలు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి