
ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ ఓ వెలుగు వెలిగాడు జగపతి బాబు. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా చెలామణి అయ్యాడు. అయితే కాలక్రమేణా హీరోగా ఛాన్సులు తగ్గిపోవడంతో విలన్ గా మారిపోయాడు. అలాగే సహాయక నటుడి గానూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు జగ్గూ భాయ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తి కర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో తనకు మరణ గండం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఓ సినిమా షూటింగ్ లో భాగంగా నన్ను అండర్ గ్రౌండ్ లో పెట్టారు. పైన మట్టేసి కప్పేశారు. దానిపైన ఒక మండపం కూడా వేశారు. తీయాల్సిన దానికంటే కొన్ని సెకన్స్ లేట్ అయింది. లోపల ఆక్సిజన్ అందడం లేదు. అప్పటికే నేను బ్రీతింగ్ టెక్నిక్ వాడి బ్రీత్ కొంచెం కొంచెం తీసుకున్నాను. నన్ను లోపల్నించి చాలా లేట్ గా తీశారు. నేను కూడా లేట్ గానే కళ్లు తెరిచాను. అప్పటికే నేను పోయాను అనుకోని అందరూ ఏడుస్తున్నారు.
‘ అదే రోజు ఈ సీన్ కంటే ముందు పొద్దునే ఒక కాల్ వచ్చింది. గతంలో నాకు పరిచయం అయిన ఒక లేడీ ఆస్ట్రాలజర్ ఫోన్ చేసి బాగానే ఉన్నారా అని అడిగింది . ‘బాగానే ఉన్నాను ఏమైంది అంటే జాగ్రత్త గా ఉండండి అని చెప్పింది. ఆ తర్వాత ఈ సంఘటన తెలిసి మళ్లీ కాల్ చేసి మీకు మరణగండం ఉంది మీరు పోవాల్సింది, పోతారని భయం వేసి పొద్దున్న కాల్ చేసి మీకు జాగ్రత్త చెప్పాను’ అని చెప్పింది అని జగ్గూ భాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కాగా జగపతి బాబు ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. అప్పల సూరి అనే ఓ వయసు మళ్లిన వృద్ధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పెద్ది మూవీకి సంబంధించి జగ్గూ భాయ్ లుక్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.