
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.అతని అత్తమ్మ పద్మావతి కన్నుమూశారు. ఈ విషయాన్ని మెహర్ రమేషే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన అత్తమ్మని తల్చుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడీ డైరెక్టర్. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారంటూ తన అత్తమ్మ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ‘ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను . మా అత్తమ్మ “పద్మావతి ” శివైక్యం పొందారు. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీ న అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు. మా కుటుంబానికి తీరని లోటు. ఓం శాంతి’ అంటూ తన అత్తమ్మకు నివాళి అర్పించారు మెహర్ రమేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. అతని అత్తమ్మకు నివాళి అర్పిస్తున్నారు.
కాగా కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు మెహర్ రమేష్. ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కంత్రి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ప్రభాస్ తో బిల్లా లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మెహర్ చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడ్డాయి. శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. భోళా శంకర్ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించడం లేదు మెహర్ రమేష్. అయితే మెగా ఫ్యామిలీకి దగ్గరి బంధువైన డైరెక్టర్ అప్పుడుప్పుడు మెగా హీరోల సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపిస్తుంటాడు.
ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను
మా అత్తమ్మ “పద్మావతి ” శివైక్యం పొందారు 🙏🏼
మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీ న
అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు 💐
మా కుటుంబానికి తీరని లోటు
ఓం శాంతి 🙏🏼 pic.twitter.com/0wj1xYOoh7— Meher Raamesh (@MeherRamesh) February 6, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..