Tollywood: ముంబైలో ఇళ్లు కొన్న సౌత్ ఇండియన్ స్టార్స్ వీరే…

మన టాలీవుడ్ సెలబ్రిటీలకి కేవలం ఒక చోట మాత్రమే కాకుండా ఎన్నో చోట్ల ప్రాపర్టీలు ఉంటాయి. అలా కొంత మంది సెలబ్రిటీలు ముంబైలో కూడా ఇళ్లు కొనుగోలు చేశారు. అక్కడ షూటింగుల కోసం వెళ్లినప్పుడు లేదా ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు ఉండేందుకు ఇళ్లు కొన్నారు. ఆ తెలుగు సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..,

Tollywood: ముంబైలో ఇళ్లు కొన్న సౌత్ ఇండియన్ స్టార్స్ వీరే...
Tollywood Stars
Follow us

|

Updated on: Feb 10, 2024 | 7:13 PM

చాలా మంది సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ప్రజంట్ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వరుసలో రష్మిక మందన్న, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ సహా చాలా మంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నటుడు యష్ కూడా బాలీవుడ్‌లో మంచి మార్కెట్ సంపాదించాడు. దీంతో చాలామంది దక్షిణాది తారలు ముంబైలో ఇళ్లు కొన్నారు.

అల్లు అర్జున్ : ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్‌లో తనదైన ముద్రవేశాడు నటుడు అల్లు అర్జున్. ఆయన నటించిన ‘పుష్ప 2’ చిత్రం హిందీలోనూ విడుదలవుతోంది. ఈ క్రమంలో బన్నీ ముంబైలో ఇల్లు కొన్నాడు. ముంబైకి వెళ్తే.. ఈ ఇంట్లోనే ఉంటారు.

సూర్య: నటుడు సూర్య దంపతులకు ముంబైలో ఒక అపార్ట్మెంట్ఉంది. సూర్య పిల్లలు ముంబైలో చదువుతున్నారు. అందుకే ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అలానే నటి జ్యోతిక బాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్:  నటుడు రామ్ చరణ్‌కు ముంబైలో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ ఇంటి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. RRR తర్వాత చరణ్ ఇమేజ్‌ ఓ రేంజ్‌కు చేరింది. దీంతో అతను చేసే సినిమాలు ప్యాన్ ఇండియా వైజ్ రిలీజ్ అవుతున్నాయి.

తమన్నా భాటియా: నటి తమన్నా భాటియా సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. కాగా తమన్నాకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు ఉంది.

పూజా హెగ్డే:  హిందీ చిత్రసీమలో నటి పూజా హెగ్డేకు మంచి డిమాండ్ ఉంది. చాలా హిందీ సినిమాల్లో నటించింది. ఆమెకు ముంబైలో ఇల్లు ఉంది. సినిమా పనుల నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు అక్కడే ఉంటుంది.

రష్మిక మందన్న:  నటి రష్మిక మందన్న సౌత్ ఇండియాతో పాటు హిందీలోనూ బిజీగా ఉంది. అక్కడ ఇల్లు కొనుగోలు చేసింది. ముంబైలోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లో రష్మికకు ఇళ్లు ఉన్నాయి.

కాజల్ అగర్వాల్:  నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన కొడుకు సంరక్షణలో నిమగ్నమై ఉంది. పెళ్లి తర్వాత ముంబైలో సెటిల్ అయ్యింది. ముంబైలో ఆమెకు అందమైన ఇల్లు ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!