
ఈ రోజు ముస్లిం పవిత్రమైన రోజు.. నేడు రంజాన్( Ramzan) పర్వదినం.. 30 రోజులు నీమనిష్ఠలతో దీక్ష ఉండి ఎంతో పవిత్రంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు ముసల్మాన్ లు. నేడు రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో బైట్ ను షేర్ చేశారు. ఈవీడియోలో బాలయ్య మాట్లాడుతూ.. “ముస్లీమ్ సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. మాత గురువు మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ.. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.. ఒక వైపు ఆధ్యాత్మికత.. మరో వైపు సర్వమాన సమానత్వం సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అందరు సుఖసంతోషాలతో ఉండాలని.. మనకు మంది భవిషత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు బాలయ్య.
బాలయ్యతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రంజాన్ సందర్భంగా ముస్లీమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే తారక్, వెంకటేష్, కళ్యాణ్ రామ్,రవితేజ,నాని, హీరోయిన్ రీతువర్మ, ఈషా రెబ్బ ఇలా పలువురు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :