రాఘవేంద్రరావు కొత్త ‘పెళ్లి సందడి’తో అతడే హీరో !

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టబోతున్నారు. ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన 'పెళ్లి సందడి' టైటిల్‌తో మరోసారి సినిమాను తెరకెక్కించనున్నారు.

రాఘవేంద్రరావు కొత్త  'పెళ్లి సందడి'తో అతడే హీరో !
Follow us

|

Updated on: Oct 10, 2020 | 6:03 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టబోతున్నారు. ఆయన కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో మరోసారి సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ జనరేషన్‌కు తగ్గట్లుగా సినిమాను రూపొందించేందుకు ఆయన రెడీ అయిపోయారు. టైటిల్ ప్రకటించిన దర్శకేంద్రుడు, నటీనటుల వివరాలను మాత్రం ప్రకటించలేదు. అయితే ఇప్పటికే హీరో ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తోంది.  ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )

25 ఏళ్ల క్రింద  రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లి సందడి’ హీరో శ్రీకాంత్‌కు స్టార్ స్టేషస్ తెచ్చిపెట్టింది. అతడి కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి అదే టైటిల్‌తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన దర్శకేంద్రుడు ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్‌ మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు.  కొత్త పెళ్లి సందడిలో రోషన్‌ని కథానాయకుడిగా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.  రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రంగంలోకి దిగారు. త్వరలో పెళ్లి సందడి షురూ చేయబోతున్నారు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.  ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )

Raghavendra Rao: Pelli Sandadi: రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' హీరో ఈ కుర్రాడే.. దర్శకేంద్రుడు స్కెచ్చేశారిలా..! - actor srikanth son roshan will act as hero in raghavendra rao pelli ...