Cinema : దృశ్యం సినిమాను మించిన సస్పెన్స్.. ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. మీ మనసులను కదిలించే సినిమా..

ప్రస్తుతం ఒక సినిమా ఓటీటీలో విడుదలైన వెంటనే ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ టాప్ ట్రెండింగ్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఇది ఒక తల్లి కొడుకుల కథ. ఈ చిత్రంలో సస్పెన్స్ దృశ్యం సినిమామాను మించి పోయింది. అంతేకాదు ప్రారంభం నుంచి చివరి వరకు ఈ మూవీ మిమ్మల్ని సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ చిత్రానికి IMDBలో మంచి రేటింగ్ కలిగి ఉంది.

Cinema : దృశ్యం సినిమాను మించిన సస్పెన్స్.. ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. మీ మనసులను కదిలించే సినిమా..
Balan The Boy

Updated on: Aug 03, 2026 | 11:57 AM

మలయాళం సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను తెరకెక్కించడంలో మలయాళం మేకర్స్ ముందుంటున్నారు. గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన సినిమా ఇటీవల 2026 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ బాగున్నప్పటికీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది. ఇప్పుడు అదే సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా కథ గుర్తింపు, ఒక సమూహానికి చెందినవారమనే భావన చుట్టూ తిరుగుతుంది. ఈ భావోద్వేగభరితమైన కథే, ఈ చిత్రాన్ని వెండితెరపై ప్రేక్షకులు మెచ్చుకోవడానికి కారణమైంది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇప్పుడు ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలోని ఊహించని సంఘటనలు.. ఆద్యంతం ఆసక్తిని కలిగించే సస్పెన్స్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సాధారణంగా మొదలైన ఈ సినిమా సాగేకొద్ది ఉత్కంఠంగా మారుతుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు బాలన్ ది బాయ్. ఇది బాలన్ అనే అబ్బాయి కథ. బాలన్ తన తల్లితో కలిసి ఒక సంస్కరమాలయంలో పెరుగుతాడు. అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత వారిద్దరూ తమ కష్టాల జీవితం నుంచి తప్పించుకోవడానికి పదే పదే తమ గుర్తింపును, నేపథ్యాన్ని మార్చుకుంటూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఎవరినీ నమ్మకుండా ఎలా జీవించాలో బాలన్‌కు అతడి తల్లి నేర్పిస్తుంది. చివరకు వారు ఒక ప్రశాంతమైన కొండ గ్రామంలో స్థిరపడతారు. కానీ ఆకస్మాత్తుగా బాలన్ తల్లి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత అతడు తన తల్లిని ఎలా కలిశారు అనేది సినిమా. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేశారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. ఈ చిత్రం IMDbలో పదికి 8.2 మంచి రేటింగ్‌ను కూడా పొందింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Loading...
Unable to load recommendations.
Follow Us