Trending Song: రెండు వారాల్లో కోటి మందికి పైగా చూశారు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. డీజేలో మారుమోగుతున్న పాట..
తెలంగాణ ఫోక్ సాంగ్... ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ప్రతి వారం కొత్త సాంగ్ ప్రోమో.. కట్ చేస్తే.. కొత్త కొత్త పాటలు విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు వారాల క్రితం విడుదలైన ఒక సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. చిన్నా, పెద్దా ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ఈ పాటకు ఇప్పటివరకు 19 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. కేవలం విడుదలైన రెండు వారాల్లోనే నెట్టింట రచ్చ చేస్తుంది ఆ పాట. ఇక ఇప్పుడు ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పాట డీజేలలో మారుమోగుతుంది. పెళ్లిళ్లలో వరుడు, వధువు ధరించే బాసింగం, జీలకర్ర బెల్లం, శ్రావణ మాసం.. ఇలా పెళ్లికి సంబంధించిన పదాలనే చేర్చి పాటగా మలిచారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పెళ్లిల్లు.. అమ్మాయి, అబ్బాయి ఇష్టాయిష్టాలు ఈ పాటలో తెలియజేస్తున్నాయి. పాటలో వచ్చే ప్రతి పదం తెలంగాణ వివాహ ఆచారాన్ని.. కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది. ఈ పాటను స్వామి నరేష్ దుబ్బా రాశారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో కుర్రాడు పాడే పాటే ఇది.
ఇక ఈ పాటకు కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం ప్రధాన బలం. ఈ సాంగ్ మ్యూజిక్ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ అందించగా.. వైష్ణవి సోనీ, ఈశ్వర్ సాయి జంటగా కనిపించారు. ఇక లిరిసిస్ట్ స్వామి నరేష్ దుబ్బా, సింగర్ శ్రీనిధి ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 19 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది ఈ సాంగ్. ఇంతకీ ఈ పాటను మీరు విన్నారా.. ? అయితే ఒకసారి వినేయండి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
బాసింగ బాలాలు సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
