Theatre- OTT Movies: డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే

|

Aug 09, 2022 | 1:32 PM

Telugu movies: మంచి హిట్‌ కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన టాలీవుడ్‌కు బింబిసార, సీతారామం చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఊపును

Theatre- OTT Movies: డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీ సినిమాలివే
Theatare Ott Movies
Follow us on

Telugu movies: మంచి హిట్‌ కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన టాలీవుడ్‌కు బింబిసార, సీతారామం చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఊపును కొనసాగించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. కంటెంట్‌ బాగుంటే కలెక్షన్లకు కొదవలేదని ఈ రెండు సినిమాలు నిరూపించడంతో దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను కూడా థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఓటీటీలోనూ కొత్త సినిమాలు రాబోతున్నాయి. మరి ఆగస్టు రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

బాలీవుడ్ ఆశలన్నీ లాల్‌సింగ్‌పైనే..

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం లాల్‌సింగ్‌ చడ్డా. టాలీవుడ్‌ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బెబో హీరోయిన్‌గా నటించింది. హాలీవుడ్‌ సినిమా ఫారెస్ట్‌ గంప్‌ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న లాల్‌సింగ్‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

రక్షాబంధన్‌

అక్షయ్‌కుమార్‌, భూమి పెడ్నేకర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రక్షాబంధన్‌. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాఖీ పండగను పురస్కరించుకుని ఆగస్టు 11న విడుదల కానుంది రక్షాబంధన్‌.

మాచర్ల నియోజకవర్గం

టాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి హీరోయిన్‌. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. నితిన్‌ ఇందులో కలెక్టర్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక రా రా రెడ్డి అంటూ అంజలి ఐటమ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

కార్తికేయ 2

నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కార్తికేయ. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు ఈ మిస్టరీని కొనసాగించేందుకు కార్తికేయ 2 గా మళ్లీ మన ముందుకు వస్తున్నాడు నిఖిల్‌. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ఈసారి శ్రీకృష్ణుడి ద్వారక నగరంలో దాగున్న రహస్యాలను ఛేదించనున్నట్లు ట్రైలర్‌లో చూపించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు13న కార్తికేయ2 థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

ఓటీటీలో సినిమాలివే..

ఆహాలో

  • మాలిక్‌ (తెలుగు)- ఆగస్టు 12
  • మహా మనిషి (తెలుగు)- ఆగస్టు 12
  • ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌-4 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12

సోనీ లివ్‌

Gargi Movie

గార్గి (తెలుగు)- ఆగస్టు 12

డిస్నీ+హాట్‌ స్టార్‌

ది వారియర్‌ (తెలుగు/తమిళ్‌)- ఆగస్టు 11

జీ5
హలో వరల్డ్‌ (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12

నెట్‌ఫ్లిక్స్‌

  • హ్యాపీ బర్త్‌డే (తెలుగు)- – ఆగస్టు 8
  • నరూటో: షిప్పుడెన్‌ సీజన్‌-1- ఆగస్టు 8
  • ఐ జస్ట్‌ కిల్డ్‌ మై డాడ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 9
  • ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ సీజన్‌2 (వెబ్ సిరీస్‌)- ఆగస్టు 10
  • లాకీ అండ్‌ కీ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 10
  • బ్యాంక్‌ రాబర్స్‌: ది లాస్ట్ గ్రేట్‌ హెయిస్ట్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 10
  • దోతా: డ్రాగన్స్‌ బ్లడ్‌: బుక్‌ 3 (హాలీవుడ్‌)- ఆగస్టు 11
  • నెవ్వర్‌ హేవ్‌ ఐ ఎవర్‌ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 12
  • బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌: సీజన్‌-8 (వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 13
  • గాడ్జిల్లా vs కాంగ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14

అమెజాన్‌ ప్రైమ్‌

  • సోనిక్‌ ది ఎడ్జ్‌హాగ్‌2 (హాలీవుడ్‌)- ఆగస్టు 10
  • ది లాస్ట్‌ సిటీ (హాలీవుడ్‌)- ఆగస్టు 10
  • మలయాన్‌ కుంజు (మలయాళం)- ఆగస్టు 11
  • ఎ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ వోన్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 12
  • కాస్మిక్‌ లవ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 12

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..