Jana Nayagan Movie: ‘జననాయగన్‌’ కు లైన్ క్లియర్! దళపతి విజయ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

కేవీఎన్ సంస్థ, యష్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించిన 'టాక్సిక్' చిత్రం మార్చి 19 నుంచి ఏకంగా జూన్ 4 కి వాయిదా పడింది. దీనికి ముందు, దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రాన్ని కూడా కెవీఎన్ సంస్థనే నిర్మించింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కూడా సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు 'జన నాయగన్' చిత్రం భవితవ్యం మార్చి 9 న తేలనుంది.

Jana Nayagan Movie: జననాయగన్‌ కు లైన్ క్లియర్! దళపతి విజయ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Jana Nayakudu Movie

Updated on: Mar 08, 2026 | 9:55 AM

ప్రముఖ కన్నడ నిర్మాన సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఆ సంస్థ నిర్మించిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడ్డాయి. కెవీఎన్, యష్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్’ మార్చి 19 న రిలీజ్ కావాల్సి ఉండగా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో జూన్ 4 వరకు వాయిదా పడింది. అంతకు ముందు కేవీఎన్ సంస్థ నిర్మించిన దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ వివిధ కారణాలతో విడుదల కాలేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇప్పుడీ సినిమా భవితవ్యం సోమవారం( మార్చి 9)న తేలనుంది. జనవరి 23న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. సెన్సార్ సభ్యులు సినిమాను రివిజన్ కమిటీకి పంపారు. దీంతో కెవిఎన్ సంస్థ దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. అయితే చివరకు సినిమాను సెన్సార్ రివిజన్ కమిటీకి పంపడానికి నిర్మాతలు అంగీకరించారు. దీని ప్రకారం, మార్చి 09న రివిజన్ కమిటీ ‘జన నాయగన్’ సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తుందని చెబుతున్నారు.

జన నాయగన్’ సినిమా మార్చి 09న మధ్యాహ్నం 2 గంటలకు సెన్సార్ బోర్డులో ప్రదర్శించనున్నారు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని ఏ సన్నివేశాలను కట్ చెబుతారు? అలాగే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారనేది ఆసక్తిగా ఉంటుంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పొందిన వెంటనే ‘జన నాయగన్’ సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. కాగా జన నాయగన్’ సినిమా తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. అయితే దళపతి విజయ్ తన టీవీకే పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా ఈ సినిమాలో డైలాగులు, సీన్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. ప్రతిపక్ష పార్టీలను విమర్శించే డైలాగ్‌లు అలాగే తన పార్టీకి లాభం చేకూరేలా ఈ సినిమా ఉందని ఈ మూవీపై విమర్శలు వచ్చాయి.

‘జన నాయగన్’ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమితా బిజు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. మ్యూజిక సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us