Jr.NTR-Minister Puvvada Ajay: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంతో సింప్లిసిటిగా ఉంటారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులు ఎక్కువే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది ఎన్టీఆర్‌ను ఇష్టపడుతుంటారు. నటనతోపాటు.. డైలాగ్స్ చెప్పడంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు యంగ్ టైగర్. తాజాగా తెలంగాణ మంత్రి తన కుమారుడితో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.
తన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. నయన్ జూనియర్ ఎన్టీఆర్‌ను పెద్ద అభిమాని. అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అతడిని జూనియర్ వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. మంత్రి కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజయ్ తన కుమారుడితోపాటు వెళ్లి కలిశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ఎన్టీఆర్ పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు.