Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..

ఇద్దరి మనసులు కలవాలే గానీ.. వయసుతో సంబంధం లేదని ఇప్పటికే పలువురు ప్రముఖులు నిరూపించారు. అర్థం చేసుకుంటే చిన్నా

Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..
Maalavika

Updated on: Nov 13, 2021 | 10:23 AM

ఇద్దరి మనసులు కలవాలే గానీ.. వయసుతో సంబంధం లేదని ఇప్పటికే పలువురు ప్రముఖులు నిరూపించారు. అర్థం చేసుకుంటే చిన్నా పెద్ద అనేది ముఖ్యం కాదంటుంటారు. సాధారణంగా వివాహం చేసుకోవడానికి అబ్బాయి వయసు అమ్మాయి కంటే కాస్త ఎక్కువగా ఉండాలని అంటుంటారు. కానీ ప్రేమకు.. వివాహనికి వయసుతో సంబంధం లేదని ఎప్పటికప్పుడూ నిరుపణ అవుతునే ఉంది. సచిన్ టెండుల్కర్ నుంచి ప్రియాంక చోప్రా వరకు ప్రేమకు.. వయసుకు మధ్య సంబంధం లేదని నిరూపించినవారే. తాజాగా మరో ప్లేబ్యాక్ సింగర్ కూడా ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది. తనకంటే చిన్నవాడిని పెళ్లిచేసుకుని స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఎంటర్‌ప్రెన్యూర్‌ అశ్విన్ కశ్యప్ రఘురామన్‏ను వివాహం చేసుకుంది. ఇతను వయసులో మాళవిక కంటే చిన్నవాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మాళవిక దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‏గా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక. తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడి శ్రోతలను అలరించడమే కాకుండా.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు 200పైగా పాటలు పాడింది. అయితే పెళ్లికి వయసుతో సంబంధం లేదని.. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని.. గౌరవించుకుంటే చాలు అని చెబుతూ.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది మాళవిక.

Also Read:  Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..

Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

Bheemla Nayak: భీమ్లానాయక్‌ సర్టిఫై చేశారు… డానియల్ శేఖర్ ఏమంటారు?