Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..

|

Apr 12, 2022 | 8:30 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి (Vijay Thalapathy) తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాలు

Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..
Vijay
Follow us on

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి (Vijay Thalapathy) తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast Movie). ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీలో నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బీస్ట్ సినిమాలో ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. అయితే సాధారణంగా విజయ్ తన సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా దూరంగా ఉంటారు. కానీ తన బీస్ట్ చిత్రం ప్రమోషన్స్‏లో విజయ్ పాల్గొనడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ కుమార్‏తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

తాను ఎందుకు ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటాడు.. ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వడు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. చాలా ఏళ్ల క్రితం తాను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ విషయాన్ని బయటపెట్టాడు. తాను ఒకటి మాట్లాడితే సదరు మీడియా వాళ్లు మరొకటి రాశారన్నారు. దీంతో మరుసటి రోజు పత్రికలో వచ్చిన వార్తను చూసి చాలా బాధపడ్డాను అని.. తాను మాట్లాడిన మాటలను పూర్తిగా వ్యతిరేకంగా రాశాన్నారు. దీంతో నువ్వు ఇలా మాట్లాడతావని మేము ఊహించలేదంటూ సన్నిహితులు, అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారని. తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని.. దీంతో అప్పట్లో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయంటూ చెప్పుకొచ్చారు విజయ్. తాను ఏం మాట్లాడను అనే నిజాలు తన ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలుసునని.. కానీ బయటి వాళ్లందరూ ఆ మాటలు నమ్మారు.. ఈ కారణంతోనే అప్పటి నుంచి మీడియాకు తాను దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు విజయ్. బీస్ట్ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించారు.

Also Read: Vivek Angihotri: మరో రెండు కథలతో రాబోతున్న ది కశ్మీర్ పైల్స్ డైరెక్టర్.. అభిషేక్ అగర్వాల్ కాంబోలో..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..