
తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast).. డైరెక్టర్ నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ముందునుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన అరబిక్ కుతు సాంగ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటివరకు విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం నటిస్తోన్న బీస్ట్ సినిమా తమిళ్.. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా భాషల్లో బీస్ట్ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేశారు. అయితే అన్ని భాషల్లో బీస్ట్ పేరుతో సినిమా విడుదల కానుండగా.. కేవలం హిందీలో మాత్రం రా అనే పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ కానున్నాడా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ హీరోగా.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం
Pushpa The Rule : సుకుమార్ ప్లాన్ పట్టాలు తప్పుతుందా.. పుష్ప 2 అనుకున్న సమయానికి రాదా..?
RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..