Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం.. ఆ కారణంతోనే ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయంటూ..

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). డైరెక్టర్ నెల్సన్ కుమార్ తెరకెక్కించిన

Beast Movie: బీస్ట్ సినిమా డైరెక్టర్ పై విజయ్ తండ్రి ఆగ్రహం.. ఆ కారణంతోనే ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయంటూ..
Vijay Father Chankdrashekar

Updated on: Apr 20, 2022 | 2:39 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). డైరెక్టర్ నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించింది. ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా విడుదలకు ముందుగా రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ విడుదలైన తర్వాత బీస్ట్ మూవీకి రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినా.. ఎక్కువగా నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. కొన్నిచోట్ల సినిమా బాలేదంటూ విజయ్ అభిమానులు థియేటర్లకు నిప్పు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫైట్స్, సాంగ్స్.. విజయ్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కసరత్తు చేసి ఉండాల్సిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ నెల్సన్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ తమిళ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ” ఇటీవల నేను బీస్ట్ చిత్రాన్ని చూశాను. అరబిక్ పాటను నేను చాలా ఎంజాయ్ చేశాను. కేవలం విజయ్ స్టార్ డమ్ వల్లే బీస్ట్ ఇంకా థియేటర్లలో వసూళ్లు రాబడుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్స్, వంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు.. స్క్రీన్ ప్లేతో ఓ మ్యాజిక్ క్రియేట్ చేయోచ్చు. కానీ ఈ సినిమాలో అదేం లేదు. మిలటరీ వ్యవస్థ.. రా ఏజెంట్ ఎలా పనిచేస్తాడు అనే విషయాలపై డైరెక్టర్ మరికొంత అధ్యాయనం చేయాల్సి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, డ్యాన్స్, ఎడిటర్, హీరో, హీరోయిన్ వీళ్ల వల్లే బీస్ట్ సినిమా హిట్ అయ్యింది. అందరి పాత్ర ఉంది కాబట్టే బీస్ట్ విజయవంతమైంది. ” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Viral Video: బంగ్లాదేశ్‌ పాటతో మళ్లీ మెరిసిన ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ.. ఆ దేశం స్టార్ హీరోతో గొంతు కలిపిన రాను

KGF Chapter 2: బాక్సాఫీస్ దగ్గర రాకీభాయ్ హవా.. కొనసాగుతున్న వసూళ్ల వేట..

Kajal Aggarwal : అందాల చందమామ ముద్దుల కొడుకు పేరు ఏంటో తెలుసా..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్..

Loading...
Unable to load recommendations.
Follow Us