తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే మాస్టర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి దీలిప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. న్యూఇయర్ కానుకగా బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్.
బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ విజయ్‌కు సంబంధించిన సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. షైన్ టామ్ చాక్, సెల్వరాఘవన్, యోగిబాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Happy New Year Nanba ❤ ⁰From team #Beast @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @manojdft @Nirmalcuts @anbariv #BeastFromApril pic.twitter.com/xNYz8kGYwP
— Sun Pictures (@sunpictures) December 31, 2021
Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..