Varisu Movie: దళపతి కోసం తమిళ్ స్టార్ హీరో.. వరిసు సినిమాలో శింబు వాయిస్..

ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌ లు కూల్‌ గా, కలర్‌ఫుల్‌ గా కనిపించాయి. ఇందులో విజయ్, రష్మికల జోడి లవ్లీగా కనిపించింది. అలాగే మరోవైపు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రంజితమే సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యింది. ఇక ఈరోజు ఈ మూవీ సెకండ్ సింగిల్ విడుదల కానుంది.

Varisu Movie: దళపతి కోసం తమిళ్ స్టార్ హీరో.. వరిసు సినిమాలో శింబు వాయిస్..
Varisu Movie

Updated on: Dec 04, 2022 | 8:41 AM

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వరిసు. ఈ సినిమాను తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌ టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్‌ లు కూల్‌ గా, కలర్‌ఫుల్‌ గా కనిపించాయి. ఇందులో విజయ్, రష్మికల జోడి లవ్లీగా కనిపించింది. అలాగే మరోవైపు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రంజితమే సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యింది. ఇక ఈరోజు ఈ మూవీ సెకండ్ సింగిల్ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్.

#TheeThalapathy అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 4న సాయంత్రం 4 గం. లకు రిలీజ్ చేస్తున్నట్లు నిన్న యూనిట్ ప్రకటించింది. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాతో హీరో శింబు పాడుతున్నారని స్పష్టం చేసింది. ఆయన వాయిస్ తో ఈ పాట పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రయూనిట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో వరిసు (తెలుగులో వారసుడు) చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us