Valimai: వలిమై వచ్చేది ఆ రోజునే.. అజిత్ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..

తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వలిమై (Valimai). ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా..

Valimai: వలిమై వచ్చేది ఆ రోజునే.. అజిత్ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..
Valimai

Updated on: Feb 02, 2022 | 10:49 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వలిమై (Valimai). ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాడు.. తెలుగుతోపాటు..ఇతర భాషల్లోని అజిత్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా వేశారు మేకర్స్.

అయితే గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్, ఆచార్య ఇలా అన్ని భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈటీ సినిమా కూడా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో అజిత్ నటిస్తోన్న వలిమై సినిమాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా కాసేపటి క్రితం చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో అతిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. . ఈ సినిమాలో అజిత్ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నారు.

Also Read: Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Radhe Shyam: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న తమిళ్ స్టార్ హీరో.. రాధేశ్యామ్ సినిమాకు పోటీగా సూర్య సినిమా..?

Venkatesh Daggubati and Rana: తండ్రి కొడుకులుగా వెంకటేష్ , రానా.. ఆ మలయాళ సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us