Varun Tej: వరుస సినిమాలతో జోరు పెంచిన మెగా ప్రిన్స్ .. కొత్త సినిమా షురూ చేసిన వరుణ్ తేజ్

|

Mar 28, 2022 | 5:26 PM

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్‌ పల్స్ తెలుసుకుని దూసుకుపోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌. ఈ  మెగా హీరో త్వరలో గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Varun Tej: వరుస సినిమాలతో జోరు పెంచిన మెగా ప్రిన్స్ ..  కొత్త సినిమా షురూ చేసిన వరుణ్ తేజ్
Varun Tej
Follow us on

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్‌ పల్స్ తెలుసుకుని దూసుకుపోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌(Varun Tej). ఈ  మెగా హీరో త్వరలో గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిరణ్ కొర్రిపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ . గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాను మొదలు పెట్టాడు వరుణ్.  ప్రవీణ్ సత్తారు డైరక్షన్‌లో వరుణ్ తేజ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ మూవీ వరుణ్ కు 12వ సినిమా.. ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.

మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. జెన్‌ నెక్స్ట్ కథలతో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తెరకెక్కిస్తారనే పేరున్న ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. సినిమాటోగ్రఫీని ముఖేష్ హ్యాండిల్‌ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌తేజ్‌ మాతృమూర్తి పద్మజ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వరుణ్‌తేజ్‌ తండ్రి నాగబాబు క్లాప్‌కొట్టారు. వారిద్దరూ సంయుక్తంగా స్క్రిప్ట్ అందజేశారు. ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, షూటింగ్‌ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..