Mahesh Babu: నన్ను తిట్టడానికి కీర్తిసురేష్ చాలా భయపడింది : మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

Mahesh Babu: నన్ను తిట్టడానికి కీర్తిసురేష్ చాలా భయపడింది : మహేష్ బాబు
Mahesh Babu
Follow us

|

Updated on: May 22, 2022 | 7:09 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మే12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ముఖ్యంగా మాస్ సాంగ్.. ఆ సాంగ్ కు మహేష్ వేసిన స్టెప్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

తాజాగా సర్కారు వారి పాట టీమ్ వైజాగ్ లో సందడి చేసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ ను వైజాగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తిసురేష్, దర్శకుడు పరశురామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు మహేష్ , కీర్తి, పరశురామ్ సమాదానాలు చెప్పారు. ఇందులో భాగంగా ఓ లేడీ అభిమాని మాట్లాడుతూ.. ఒక సీన్లో ‘కీర్తి సురేశ్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు చాలా ఎగ్జైట్ అవుతారు కదా.? రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా చేశారా? అని అడిగితే “మా ఆవిడకి నాకు గొడవపెట్టాలని అనుకుంటున్నారా.?” అంటూ మహేశ్ నవ్వారు. అయితే ఆ సీన్  కీర్తి సురేశ్ లేకుండానే చేశాం.. అని అన్నారు మహేష్. అలాగే ఈ సినిమాలో ఒక సీన్లో నన్ను కీర్తి సురేష్ తిట్టాలి.. కానీ కీర్తి రెండు మూడు టేకులు తీసుకుంది. అప్పుడు పరశురామ్ వచ్చి నా ముఖం చూస్తూ తిట్టాలని చెప్పారు. ‘మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు సార్ అని కీర్తి నాతో అంది. మీ ఫ్యాన్స్ ఊరుకోరు. నన్ను తిడతారు. నేను చేయను సార్ అంది. వాళ్లు ఏమీ అనరమ్మా అని దైర్యం చెప్పాను.. అన్నారు. దానికి కీర్తి మాట్లాడుతూ.. నా నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయం వేసిందని.. ఆ సమయంలో నాకు గుండె ఆగిపోయింది. ఇప్పటికీ ఆ సీన్ గురించి మాట్లాడుతుంటే తనకి భయం వేస్తోందని చెప్పింది కీర్తిసురేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ