సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ గుంటురు కారం సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే మహేష్ గారాలపట్టి సితారకు ఇప్పటికే ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉంది. మల్టీటాలెంటెడ్ గర్ల్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోస్, రీల్స్ చేస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి చిన్నారులకు అవసరమైన విషయాలను చెబుతూ వీడియోస్ చేసింది. ఇక కొద్ది రోజులుగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‌కు అందంగా డ్యాన్స్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది సితార. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై సితారా యాడ్ ఫోటోస్ ప్రదర్శించారు.
ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ చేసింది సితార. మొదటిసారి ఓ ప్రముఖ జ్యూవెల్లరీ యాడ్ షూట్ లో పాల్గొంది సితార. ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ లో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నవయసులో జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. కమర్షియల్ యాడ్ లో సితార నటించడంతో .. తండ్రిని మించిన తనయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
మహేష్ బాబు, నమ్రత దంపతుల గారాలపట్టి సితార.. చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్. ఇప్పటికే భారతనాట్యంలో శిక్షణ తీసుకుంటుంది. గతంలో తన కూతురు భారతనాట్యం చేసిన వీడియోను మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల పలు సూపర్ హిట్స్ పాటలకు సితార అందంగా డ్యాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.