Disco Shanti: అయ్యో!! డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో సెలైన్ బాటిట్స్‌తో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్

రియల్ స్టార్ దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కోశాంతి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె సెలైన్ బాటిల్స్ తో ఆస్పత్రి బెడ్ పై కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు డిస్కో శాంతికి ఏమైందా? అని కంగారు చెందుతున్నారు.

Disco Shanti: అయ్యో!! డిస్కోశాంతికి ఏమైంది? ఆస్పత్రిలో సెలైన్ బాటిట్స్‌తో శ్రీహరి భార్య.. ఫొటో వైరల్
Disco Shanti

Updated on: Sep 15, 2026 | 8:56 PM

రియల్ స్టార్ దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్ పై సెలైన్ బాటిల్స్ తో కనిపించింది. ఈ ఫొటోలను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఒక్కసారి కంగారు పడ్డారు. అయితే తన హెల్డ్ కండిషన్ పై స్వయంగా డిస్కో శాంతినే అప్డేట్ ఇచ్చింది. ‘ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఇంటికి కూడా చేరుకున్నాను’ అని రాసుకొచ్చారు. అయితే ఉన్నట్లుండి ఆమె ఎందుకు ఆస్పత్రి పాలయ్యిందో మాత్రం చెప్పలేదీ సీనియర్ నటి. ఏదేమైనా ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుందని, అదే చాలని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహించాలని డిస్కో శాంతికి సూచిస్తున్నారు. కాగా డిస్కో శాంతి విషయానికి వస్తే.. హీరోయిన్ గా చేయకపోయిన్పటికీ అంతకు మించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందీ అందాల తార. ముఖ్యంగా 90’sలో సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా డిస్కో శాంతి ఉండాల్సిందే. బంగారు కోడి పెట్ట లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసిందీ అందాల తార.

కాగా ప్రముఖ నటుడు, రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డిస్కో శాంతి. పెళ్లి తర్వాత సినిమాలను బాగా తగ్గించేశారామె. ఇక 2013లో శ్రీహరి మరణం తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారీ సీనియర్ నటి.  ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలే జీవితంగా జీవనం గడుపుతున్నారామె. ఇదిలా ఉంటే శ్రీహరి కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రెండు, మూడేళ్ల క్రితం రాజ్ దూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్. ఆ తర్వాత కోతికొమ్మచ్చి అనే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. ఇప్పుడీ స్టార్ కిడ్ చేతిలోపలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. స్టూడెంట్, ఆస్మాన్ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు మేఘాంశ్.

ఇవి కూడా చదవండి

 

 

ఆస్పత్రిలో డిస్కో శాంతి..

ఇద్దరు కుమారులతో శ్రీహరి భార్య డిస్కో శాంతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us