ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అతను.. స్టార్ హీరో గురించి శ్రీదేవి విజయ్ కుమార్ క్రేజీ కామెంట్స్

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది.

ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అతను.. స్టార్ హీరో గురించి శ్రీదేవి విజయ్ కుమార్ క్రేజీ కామెంట్స్
Sri Devi Vijayakumar

Updated on: Sep 01, 2026 | 7:00 AM

ప్రభాస్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారని, ఆయన మంచితనమే ఆయన విజయ రహస్యమని నటి శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ వ్యక్తిత్వం, సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఎంతో గౌరవం, మర్యాద కలిగిన వ్యక్తి అని, ముఖ్యంగా ఆహారం పట్ల ఆయనకున్న ప్రేమ అద్భుతమని శ్రీదేవి తెలిపారు. ఆయన ఎక్కువ తినకపోయినా, అందరినీ ప్రేమగా తినిపించాలని కోరుకుంటారని, ఎవరైనా తింటే వాళ్ల కుటుంబం ఎంతో సంతోషిస్తుందని వివరించారు. ఈ అలవాటు ఆయనకి కొత్తగా వచ్చినది కాదని, పుట్టి పెరిగినప్పటి నుంచి అదే స్వభావమని పేర్కొన్నారు. ప్రభాస్ ఆహారం గురించి చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. తాను ఆ డిషెస్ పేర్లను అనుకరించలేనని, అవి అంతకు ముందు ఎప్పుడూ విననివి అని అన్నారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

నాన్ వెజ్ ప్రియురాలిగా తాను వాటిని ఎంతో ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. అప్పట్లో తామిద్దరం వెరీ యంగ్ గా  ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా కలిసి తిని, ఆ బ్రేక్‌ని బాగా ఎంజాయ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ ఆమెను శ్రీ లేదా పాప అని పిలిచేవారని, తన పెట్ నేమ్ పాప అని, ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారని తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి, ఆపై గ్లోబల్ స్థాయికి ఎదగడం పట్ల శ్రీదేవి గర్వం వ్యక్తం చేశారు. ఆయన ఎదుగుదల గ్రాఫ్ ఇంత పెద్దదిగా ఉంటుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఈ స్థాయికి ఆయన మంచితనం, దైవ ఆశీర్వాదమే కారణమని పేర్కొన్నారు.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

. ఇది ఒక అందమైన ప్రయాణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహో వంటి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ఆయన కేవలం తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికే కాకుండా, కొత్త పాత్రలను ప్రయత్నించడానికి రిస్క్ తీసుకోవడం మంచి విషయమని శ్రీదేవి ప్రశంసించారు. ఆయన ప్రతి సినిమాను రిస్క్ గురించి ఆలోచించకుండా చేయడం గొప్ప విషయమని, ఆయన ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us