Sreeleela: ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది.. కుర్ర హీరోయిన్ భారీ ఆశలు..

|

Jan 04, 2022 | 3:52 PM

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ కలలరాకుమారిగా  మారింది అందాల భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Sreeleela: ఆ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది.. కుర్ర హీరోయిన్ భారీ ఆశలు..
Follow us on

Sreeleela: ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ కలలరాకుమారిగా  మారింది అందాల భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ పరిశ్రమలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన శ్రీలీల ఇప్పుడు తెలుగులో తన సత్తా చాటడానికి సిద్ధం అయ్యుంది. ఇక పెళ్ళిసందడి సినిమాలో అందంతో చలాకీ తనంతో ఆకట్టుకునన్న శ్రీలీల నటన పరంగానూ మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ వయ్యారి భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నది మాస్ మహారాజ రవితేజ సరసన నటిస్తుంది. రవితేజ త్రినాద్ రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ భామ. ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఈ లోగానే అమ్మాయికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

ఇదిలా ఈ చిన్నది కుర్రహీరోలతో జతకడుతుందేమో అనుకుంటే..అమ్మడు మాత్రం స్టార్ హీరోల సినిమాలే కావాలని పట్టు పడుతుందట.. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనటించాలని ఉందని చెప్తుంది ఈ వయ్యారి భామ. తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాలో నటించాలని ఉందని అంటుందట శ్రీలీల. మహేష్ సినిమాలో ఎలాగైనా నటించాలని ప్రయత్నిస్తుందట. అయితే రీసెంట్ గా పరిచయం అయిన శ్రీలీల అప్పుడే మహేష్ సినిమా రేంజ్ అందుకోవాలంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ముందుగా కుర్ర హీరోల సినిమాల్లో మెప్పించి ఆతర్వాత మహేష్ కంట్లో పడితే బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి, వంశీ పైడిపల్లి తో సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాల తర్వాత మహేష్ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..