Sreeleela: ఇదేం లీల.. శ్రీలీల.. 80శాతం అటెండెన్స్‌ లేకుండా డాక్టర్ పట్టా ఎలా..?

హీరోయిన్ శ్రీలీల యాక్టర్ కమ్ డాక్టర్ అయింది. ఇప్పుడీ టాపిక్ పై సోషల్ మీడియా తెగ చర్చిస్తోంది. హీరోయిన్ శ్రీలీల ఓకే... కానీ డాక్టర్ శ్రీలీల నాట్ ఓకే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు, సందేహాలు, మీమ్సూ వస్తున్నాయి . షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఒక హీరోయిన్… కఠినమైన మెడికల్ కోర్స్‌ను ఎలా పూర్తి చేసింది? అటెండెన్స్ వివాదం ఏంటి? ముంబైలో చదువు, అన్నీ ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సినిమాలను… ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసింది?

Sreeleela: ఇదేం లీల.. శ్రీలీల.. 80శాతం అటెండెన్స్‌ లేకుండా డాక్టర్ పట్టా ఎలా..?
Sreeleela

Updated on: Feb 19, 2026 | 9:47 PM

డాక్టర్ యాక్టర్ కావొచ్చు.. కానీ యాక్టర్ డాక్టర్ కావొచ్చా..? కావొచ్చు.. కష్టపడితే.. 24గంటలు ఫోకస్ పెడితే.. నాలుగన్నరేళ్లు దానిపైనే దృష్టిపెడితే..
కానీ ఏడాదికి 8 నెలలు షూటింగ్‌లతో బిజీగా ఉండి.. షాప్‌ ఓపెనింగ్‌లు, దేశవిదేశాల్లో ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో ఊపిరిసలపని షెడ్యూల్స్‌, ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా ఉండేంత బిజీ. అన్నీ ఇండస్ట్రీలను కవర్ చేసేలా సినిమాలు చేస్తూ.. తీరిక దొరకని షూటింగ్‌లతో గడిపేస్తూ.., క్లాస్‌లకు హాజరు కాకుండా, అటెండెన్స్ లేకుండా డాక్టర్ కోర్సు కంప్లీట్ చేయవచ్చా..?.. ఈజ్ ఇట్ పాజిబుల్.. నో వే కదా.. కానీ మన యాక్టరమ్మ డాక్టరైంది. ఆ యాక్టరమ్మే శ్రీలీల.

హీరోయిన్ శ్రీలీల.. అంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు.. అదే డాక్టర్ శ్రీలీల అంటే మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతోంది సోషల్ మీడియా.నాలుగున్నరేళ్లు కిందా మీద పడి, రేయింబవళ్లు కష్టపడితే పూర్తికానీ డాక్టర్ చదువు..  రోజుకు 3 కాల్‌షీట్సు, నాలుగు పాటలు, ఆరు స్టెప్పులు.. అంటూ సాగే శ్రీలీలకు ఎలా సాధ్యమైంది అన్నదే ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న.

శ్రీలీల 2020లో డి.వై.పాటిల్ కాలేజ్‌లో MBBSలో చేరింది. అంటే కరోనా టైమ్. ఆ సంవత్సరం కాలేజ్ లేదు. ఇంకో రకంగా చూసుకున్నా 2020 నుంచి శ్రీలీల సినిమా కెరీర్ చూస్తే, ప్రతి ఏటా రెండు నుంచి నాలుగు సినిమాలు చేసినట్లు సినీమా లెక్కలు చెబుతున్నాయి. ఎంత లేదన్న కనీసం ఎనిమిది నెలల కాలం ఆమె షూటింగుల్లో బిజీ. మరోవైపు షో రూమ్ ప్రారంభోత్సవాలు.. రిబ్బన్ కటింగులు, విదేశాల్లో ఈవెంట్స్ వగైరాలు ఉండనే ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌లో వుండే శ్రీలీల.. షూటింగు ఉన్నప్పుడు లొకేషన్లలో ఉండే శ్రీలీల.. ముంబైలో కాలేజ్‌కు ఎప్పుడు వెళ్లినట్లు?. ఇది మామూలుగా ఏదో మెడికల్ సర్టిఫికెట్ పెట్టి.. అటెండెన్స్ మాఫీ చేసుకుని పరీక్షలకు హాజరై పాసయ్యే డిగ్రీ కాదు. నాలుగున్నరేళ్ల డాక్టర్ కోర్సు, కఠినమైన ఇంటర్నెషిప్ ఎప్పుడు చేసినట్లు? అంతేకాదు అటెండెన్స్ కనీసం 80శాతం వరకు ఉండాలి. 75 శాతం అయితే పక్కా మెయింటైన్ చేయాలి. అలాగే క్లినికల్ పోస్టింగ్స్, ప్రాక్టికల్స్, మెయిన్ ఎగ్జామ్స్… ఇవన్నీ తప్పనిసరి. మరి ఇంత బిజీగా ఉండే ఒక స్టార్ హీరోయిన్ కోర్స్ పూర్తి చేయడం ఎలా సాధ్యమైంది అనే సందేహం చాలా మందిలో ఉంది. కొందరు ఇది అసాధ్యం అంటుంటే, మరికొందరు క్రమశిక్షణతో సాధ్యమే అంటున్నారు.

మరోవైపు ఇండియన్ సినీ హిస్టరీలో హీరోయిన్లు డాక్టర్లు కావడం చాలా అరుదు. సాయిపల్లవి జార్జియాలోని మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చింది. అలాగే మానుషీ చిల్లర్ హర్యానాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి, మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అదితి గోవిత్రికర్ వైద్యురాలిగా ఎండీ పూర్తి చేసి, తరువాత మోడలింగ్, సినిమాల్లో రాణించింది. డైరెక్టర్ శంకర్ కుమార్తె ఆదితి శంకర్ కూడా డాక్టరే. కానీ వీళ్లంతా డాక్టర్ కోర్సు పూర్తి చేసుకున్నాక సినిమాల్లోకి వచ్చారు. కానీ శ్రీలీల 17ఏళ్లకే సినిమాల్లోకి వచ్చింది. ఓవైపు ఏడాదికి.. రెండు మూడు సినిమాలు చేస్తూనే డాక్టర్ కోర్సు పూర్తి చేయడమే విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్స్. మరి ఇదేం లీలో శ్రీలీలే క్లారిటీ ఇవ్వాలి.

Also Read: శివశంకర్ మాస్టర్ చనిపోతే పాడె మోసేవారు కూడా లేరు.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు మాత్రం..

 

Follow Us