AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవర కొండ సినిమానుంచి శ్రీలీల అవుట్.. ఆమె ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరోయిన్

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇక అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమాలో నటించిన తర్వాత గీతగోవిందం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉండటంతో పాటు నటనతో ఆకట్టుకున్నారు. దాంతో స్క్రీన్ పై హిట్ పెయిర్ గా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి ఆ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు.

Vijay Deverakonda: విజయ్ దేవర కొండ సినిమానుంచి శ్రీలీల అవుట్.. ఆమె ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరోయిన్
Vijay Devarakonda, Sreeleel
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2023 | 9:58 AM

Share

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రేజీ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇక అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమాలో నటించిన తర్వాత గీతగోవిందం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉండటంతో పాటు నటనతో ఆకట్టుకున్నారు. దాంతో స్క్రీన్ పై హిట్ పెయిర్ గా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి ఆ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది.

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలు అందుకోలేకపోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్ తన 12వ సినిమాతో బిజీ కానున్నాడు.

విజయ్ దేవరకొండ గౌతం తిన్నూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొనీమద్యే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజాకార్యక్రమం జరిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. శ్రీలీల పూజాకార్యక్రమంలోనూ పాల్గొంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో రష్మిక మందన్నాను ఎంపిక చేశారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 12వ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికైందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

విజయ్ దేవరకొండ .. సోషల్ మీడియా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు