Love Story: విడుదల దగ్గర పడుతున్న టైం లో లవ్ స్టోరీలో మార్పులు చేస్తున్న శేఖర్ కమ్ముల..

టాలీవుడ్ లో ప్రేమకథలు తెరకెక్కించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ వీరిలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. అందమైన ప్రేమకథలను అర్ధవంతంగా చాలా సహజంగా రూపొందించడం లో శేఖర్ కమ్ముల దిట్ట.

Love Story:  విడుదల దగ్గర పడుతున్న టైం లో లవ్ స్టోరీలో మార్పులు చేస్తున్న శేఖర్ కమ్ముల..
Love Story

Edited By:

Updated on: Apr 28, 2021 | 10:25 AM

Love Story: టాలీవుడ్ లో ప్రేమకథలు తెరకెక్కించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. అందమైన ప్రేమకథలను అర్ధవంతంగా చాలా సహజంగా రూపొందించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ములు. ఇక సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. ఫిదా అనే మరో అందమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించి అందరిని ఫిదా చేసారు. ఇప్పుడు మరో సారి సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టి లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు శేఖర్. అక్కినేని నాగ చైతన్, సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు పాటలు, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమానుంచి రిలీజ్ అయిన సారంగదరియా.. పాట సంచలనం సృష్టిస్తుంది.

ఇదిలా ఉంటే లవ్ స్టోరీ’ సినిమాను ఈ నెల 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో విడుదలను వాయిదా వేసారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నారట శేఖర్ కమ్ముల . సినిమాని మరోసారి మొత్తం చూసి..కొంత లెంగ్త్ తగ్గించారట. దాదాపుగా ఓ పది నిమిషాల సినిమాని ట్రిమ్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో సినిమా ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చిందట. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్ పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’… రిమేక్‌లో నయన్‌తోపాటు మరో హీరోయిన్‏…!! ( వీడియో )

Acharya Movie: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..

Loading...
Unable to load recommendations.
Follow Us