సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరాల కాలంగా ఫీల్మ్ ఇండస్ట్రీ చేదు వార్తలు వింటూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. అందులో కరోనా మహమ్మారికి బలైనవారు కొందరుంటే.. మరికొందరు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇక మరికొందరు అకాల మరణంతో సినీలోకంతోపాటు.. ప్రేక్షకులు సైతం షాకయ్యారు. ఇలా గత రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంతోమంది ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇక రెండు రోజుల తేడాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా.. ఈరోజు సాయంత్రం పాటల సారథి సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
2020-21లో కన్నుమూసిన ప్రముఖులు..
1. సిరివెన్నెల సీతారామశాస్త్రి (66 సంవత్సరాలు).. పాటల రచయిత.. నవంబర్ 30న అనారోగ్యంతో మరణించారు.
2. శివ శంకర్ మాస్టర్ (72 సంవత్సరాలు).. కొరియోగ్రాఫర్.. నవంబర్ 28న అనారోగ్యంతో..
3. పునీత్ రాజ్‌కుమార్ (46 సంవత్సరాలు).. కన్నడ పవర్ స్టార్ హీరో.. అక్టోబర్ 29న గుండెపోటుతో.
4. టీఎన్ ఆర్.. జర్నలిస్ట్ కమ్ నటుడు.. మే 10న కరోనాతో..
5. మహేశ్ కత్తి (45 సంవత్సరాలు).. జర్నలిస్ట్ కమ్ నటుడు.. జులై 10 యాక్సిడెంట్..
6. సిద్ధార్థ్ శుక్లా (40 సంవత్సరాలు).. మోడల్ కమ్ నటుడు.. సెప్టెంబర్ 2న గుండెపోటుతో
7. మహేశ్ కోనేరు (40 సంవత్సరాలు).. నిర్మాత.. అక్టోబర్ 12న మరణించారు..
8. వివేక్ (60 సంవత్సరాలు).. పాపులర్ తమిళ నటుడు.. ఏప్రిల్ 17 గుండెపోటుతో..
9. బీఏ రాజు (62 సంవత్సరాలు).. నిర్మాత, జర్నలిస్ట్.. మే 23న మరణించారు.
10. కేవీ ఆనంద్ (54 సంవత్సరాలు).. దర్శకుడు, సినిమాటోగ్రఫర్.. ఏప్రిల్ 30న మరణించారు.
11. ఆర్ ఆర్ వెంకట్ (57 సంవత్సరాలు).. నిర్మాత.. సెప్టెంబర్ 27న మరణించారు.
12. ఎస్పీ బాల సుబ్రమణ్యం.. గాయకుడు.. సెప్టెంబర్ 25న అనారోగ్యంతో మరణించారు.
Also Read: Sirivennela Seetharama Sastri: సిరివెన్నెల ఆణిముత్యాలు.. అవార్డులు అందించిన మధురగీతాలు..