Devara: టిల్లు, విశ్వక్ మధ్యలో ఎన్టీఆర్.. దేవర స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అలాగే కరణ్ జోహార్, అలియా భట్ లతో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం తారక్ హైదరాబాద్ తిరిగి వచ్చాడు.

Devara: టిల్లు, విశ్వక్ మధ్యలో ఎన్టీఆర్.. దేవర స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..
Devara
Follow us

|

Updated on: Sep 13, 2024 | 8:41 PM

ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అలాగే కరణ్ జోహార్, అలియా భట్ లతో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం తారక్ హైదరాబాద్ తిరిగి వచ్చాడు.

ఆ వెంటనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ సన్నిహితులు, ఫ్యాన్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఎన్టీఆర్, కొరటాల శివలతో ఆ ఇద్దరు చేసిన ఇంటర్వ్యూ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని టాక్ నడుస్తుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

సిద్ధు, విశ్వక్ సేన్ ఇద్దరూ మొదటి నుంచి తారక్ వీరాభిమానులు. ఇటీవలే దేవర ట్రైలర్ గురించి ఓ యూట్యూబర్ చేసిన కామెంట్స్ పై విశ్వక్ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ తో సిద్ధు, విశ్వక్ కలిసి చేసిన ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిపోతుందని.. సిద్దు, విశ్వక్ పోటీపడి మరీ తారక్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. దేవర సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోకాళ్ళపై నిల్చొని వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి
మోకాళ్ళపై నిల్చొని వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి
గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంట
గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంట
ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.!
ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.!
అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారుల మృత్యువాత‌.!
అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారుల మృత్యువాత‌.!
‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!
‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!
నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.
నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.
ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భయబ్రాంతులకు లోనైన జనం
ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భయబ్రాంతులకు లోనైన జనం
జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!
జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!
మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారి కోసం వినూత్న నిర్ణయం.!
మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారి కోసం వినూత్న నిర్ణయం.!
నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..
నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..