DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్

|

Feb 16, 2022 | 2:55 PM

DJ Tillu Cast: డీజే టిల్లు మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

DJ Tillu Box Office Collections: కలెక్షన్స్‌తో మైండ్ బ్లాంక్ చేస్తున్న డీజే టిల్లు.. ట్రేడ్ నిపుణులు సైతం షాక్
Dj Tillu
Follow us on

DJ Tillu Theatrical Trailer :రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టింది తెలుగు ఆడియెన్స్ కానీ.. కాస్తా పెప్ ఉన్న మూవీ ఒక్కటి వస్తే బాగుండు అనుకున్నారు. ఈ క్రమంలో డీజే టిల్లు అంటూ దూసుకువచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ‘అట్లుంటది మనతోని’ అంటూ థియేటర్లలో రచ్చ చేశాడు. వాస్తవానికి.. ట్రైలర్‌తోనే సినిమాపై ఓ రేంజ్ బజ్ పెరిగింది. తన మార్క్ ఇంటర్వ్యూలతో ఇంకాస్త హైప్ పెంచాడు సిద్ధు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలక్షన్ల విషయంలో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. తొలి షో తర్వాత పాజిటివ్ టాక్ రావడం, మరో సినిమా పోటీకి లేకపోవడంతో..   హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో థియేర్లపై దండయాత్ర చేస్తున్నాడు డీజే టిల్లు. ఫస్ట్ కలెక్షన్స్ మైండ్ బ్లాంక్ చేశాయి.  అదే కంటిన్యూ చేస్తూ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేశాడు సిద్ధూ. విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లి కాసుల వర్షం కురిపిస్తున్నాడు.

ఈ నాలుగు రోజుల్లో టోటల్ కలెక్షన్స్ చూస్తే..

  • మొదటి రోజు: 3.18 కోట్లు
  • రెండవ రోజు: 2.62 కోట్లు
  • మూడవ రోజు: 1.40 కోట్లు
  • నాలుగవ రోజు: 1.09 కోట్లు

మొత్తం ఆంధ్రా, తెలంగాణ కలిపి: 8.29 కోట్లు (14.70 కోట్ల గ్రాస్)

ఇక అమెరికాలో కూడా డీజే టిల్లు మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 7.70 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కలెక్షన్స్ గమనిస్తే.. ఫస్ట్ వీక్ లోపలే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది మూవీ. ప్రజంట్ మానియా చూస్తే.. మంచి లాభాలు ఇంకా ముందున్నాయని అర్థమవుతుంది. కాగా మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read: RC 15 Movie: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేకర్స్.. రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్‏లో అలా..