Shruti Haasan : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆ మూవీలో చిరుకి జోడీగా శృతిహాసన్

కమల్ హాసన్‌ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిగా టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతోంది శృతిహాసన్‌. అటు కోలీవుడ్లోనూ.. ఇటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ...

Shruti Haasan : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆ మూవీలో చిరుకి జోడీగా శృతిహాసన్

Edited By:

Updated on: Feb 13, 2021 | 2:30 PM

Shruti Haasan : కమల్ హాసన్‌ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిగా టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతోంది శృతిహాసన్‌. అటు కోలీవుడ్లోనూ.. ఇటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పాటలు పాడుతూ.. సింగిల్స్‌ను కంపోజ్‌ చేస్తూ.. తండ్రిలా మల్టీటాలెంటెడ్ అని అందరి చేత అనిపించుకుంటుంది ఈ జూనియర్‌ హాసన్. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల శ్రుతి కెరీర్‌కు కాస్త గ్యాప్ వచ్చింది.

`కాటమరాయుడు` తర్వాత రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నశృతి రీసెంట్ గా ‘క్రాక్’ సినిమాతో తెలుగు సూపర్‌ గా రీఎంట్రీ ఇచ్చిది. మాస్ మహారాజ్ రవితేజ తో జోడీ కట్టి గ్లామర్‌తోనూ.. యాక్టింగ్‌తోనూ తెలుగు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంది. ఇక పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`లో సినిమాలోనూ నటిస్తూ.. టాలీవుడ్‌లో సూపర్‌ అవకాశాలను పట్టేసుకుంటుంది. అలా అవకాశాలను గాలిస్తూ… మెగాస్టార్‌ చిరంజీవి సరసన ఛాన్స్‌ కొట్టేసింది శృతి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబి రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఆల్‌మోస్ట్‌ ఖరారు అయిపోయిందట శృతి. పవర్‌ఫుల్ ఎమోషనల్ కథతో బాబి రూపొందించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా  శృతితోపాటు రకుల్ ప్రీత్ కూడా లైన్లో ఉందట. అయితే ఆ ఛాన్స్ పొందే అవకాశాలు శృతికే ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tuck Jagadish : ప్రేమికుల దినోత్సవం రోజున సర్ఫరైజ్ చేయనున్న నేచురల్ స్టార్ నాని

 

Loading...
Unable to load recommendations.
Follow Us