Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?

హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు...

Shruti Haasan: సీక్రెట్ టాటూ రివీల్ చేసిన శృతి హాసన్.. ఎవరి పేరు వేసుకుందో తెలుసా?
Sruthi

Updated on: Oct 06, 2021 | 5:49 PM

హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. మొన్న ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. శృతి అక్టోబర్ 2 న బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి షాపింగ్ మాల్‎కు వెళ్లారు. అక్కడ ఆమె దిగిన ఫొటోను తన ఇన్‎స్టాలో పోస్ట్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్ సంతను హజారికతో దిగిన మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

తాజాగా శృతి హాసన్ ఇన్‎స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఆమె వేసుకున్న టాటూ ఉంది. భుజం వెనక, వీపు పై భాగంలో ఎడమ వైపు ఆమె టాటూ వేయించుకున్నారు. ఆ టాటూ తమిళంలో ఉంది. ఇంతకీ టాటూలో ఉన్నది ఎవరి పేరు అంటే.. ఆమె పేరే.. పేరునే శృతి హాసన్ తమిళంలో శృతి అని టాటూ వేయించుకుంది. శృతి హాసన్ ఇటీవల తన సోదరి అక్షర హాసన్‎.. రానా దగ్గుబాటితో కలిసి ఒక మ్యూజిక్ వీడియో చేశారు. ఈ మ్యూజిక్ వీడియో రానా యొక్క యూట్యూబ్ ఛానల్ “సౌత్ బే” కోసం చేశారు. త్వరలో మ్యూజిక్ వీడియో విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ సినిమాలో శృతి నటిస్తోంది. సాలార్ ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హిందీలో వెబ్ సిరీస్‎లో నటిస్తోంది.

Read Also.. MAA Elections 2021: మా ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటుకు పదివేలు.. సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us