డైరెక్టర్ తిరుమల కిషోర్ (Thirumala Kirshore) దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand ) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu).. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్ కుమార్ వంటి సీనియర్ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో హీరో శర్వాంద్ వరుసగా పెళ్లి చూపులకు వెళ్తుంటాడు..కానీ అతడి కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు పిల్ల నచ్చకపోవడంతో అన్ని రిజెక్ట్ చేస్తుంటారు. దీంతో శర్వానంద్ ఇరిటేట్ అవుతుంటాడు. చివరకు ప్లా్ట్ ఫామ్ మీద కూడా పెళ్లి చూపులు పెడతారు. ఇందులో బ్రహ్మనందం కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. అలా సాగిపోతున్న శర్వానంద్ జీవితంలోకి రష్మిక రావడం. ఆమెతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి అంటూ శర్వానంద్ అనుకుంటుండగా.. రష్మిక నో చెప్తుంది. రష్మికను పెళ్లికి ఒప్పించడానికి శర్వానంద్ ట్రై చేయడం ట్రైలర్లో చూపించారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు నెట్టింట్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..
Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..
Chiranjeevi : గ్యాంగ్‌లీడర్ మార్క్ మసాలా ఎంటర్టైనర్తో రానున్న మెగాస్టార్..?