
సోషల్ మీడియా వల్ల చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా ఓ రేంజ్ లో నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. కొంతమంది నెటిజన్స్ కావాలనే సెలబ్రెటీల గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం.. లేదా ట్రోల్ చేయడానికి రెడీ అవుతుంటారు. హీరోయిన్స్ విషయంలో నిత్యం ఎన్నో రకాల ట్రోల్స్ , నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొంతమంది హీరోయిన్స్ పై బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ రంగు గురించి, ఏజ్ గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఏజ్ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఓ నెటిజన్.. దానికి ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తమ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తుంటారు.. తాజాగా అలాగే నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ నటి షమితా శెట్టి. ఈ అందాల భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తెలుగులో షమితా శెట్టి ఒకటి రెండు సినిమాలు చేసింది. పిలిస్తే పలుకుతా లాంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈ చిన్నది బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.
సినిమాలతో పాటు బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. అలాగే టీవీ షోల్లోనూ పాల్గొంది షమితా శెట్టి. ఇక ఈ చిన్నది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా తాజాగా ఓ నెటిజన్ షమితా శెట్టిపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. షమితా శెట్టి వయసు 47 ఏళ్లు. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది. అయితే ఓ నెటిజన్స్ వయసు పెరిగిపోతుంది.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్.? వయసున్నోళ్లకు పిల్లలు కూడా ఉన్నారు.. అంటూ అవహేళన చేస్తూ కామెంట్ చేశాడు. అన్ని గట్టి కౌంటర్ ఇస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. నా వయసుకు నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను.. అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారని భయ్యా? అంటూ కౌంటర్ ఇచ్చింది షమితా శెట్టి.