ఆ రోజు సౌందర్యతో పాటు నేను వెళ్ళాల్సింది.. ఆ కారణంతోనే వెళ్ళలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

అలనాటి అందాల తారల్లో సౌదర్యం మొదటి వరసలో ఉంటారు. శ్రీదేవి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. అందం, అభినయం కలబోసిన సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన దైన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఆ రోజు సౌందర్యతో పాటు నేను వెళ్ళాల్సింది.. ఆ కారణంతోనే వెళ్ళలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Soundarya

Updated on: Mar 13, 2026 | 12:06 PM

భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా రాణించింది అందాల తార సౌందర్య. అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించింది ఆమె. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె… తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలోని అందరూ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం 12 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య. కానీ 31 ఏళ్ల వయసులో కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఎవరు ఊహించని విధంగా విమాన ప్రమాదంలో మరణించింది. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో అరంగేట్రం  చేసిన సౌందర్య.. తమిళంలో పొన్నుమణి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. 1997లో డైరెక్టర్ సుందరి సి దర్శకత్వం వహించిన అరుణాచలం సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే హిందీలోనూ బడా హీరోల సినిమాల్లో నటించింది.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. .స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతున్న క్రమంలోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూసింది. అయితే సౌందర్య ప్రయాణించిన అదే హెలికాఫ్టర్ లో తాను కూడా వెళ్ళాల్సింది.. కానీ చివరి నిమిషంలో వెళ్లడం కుదరలేదు అని ఓ హీరోయిన్ తెలిపింది.

ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా. గతంలో ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ..  సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్ .. చాలా మంచి వ్యక్తి.. ఆమె మరణవార్త విని నేను తట్టుకోలేకపోయా.. నిజానికి నేను కూడా అదే హెలికాఫ్టర్ లో ప్రచారానికి వెళ్లాలి.. కానీ నేను షూటింగ్ లో బిజీగా ఉండటంతో నేను వెళ్లలేదు అని తెలిపారు మీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాంటి అందాల తార, అంత గొప్ప నటికీ అలాంటి చావు రాకుండా ఉండాల్సింది అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సౌందర్య ఉండిఉంటే ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేసేవారు అని తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us