మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే మోగుతున్నాయి. చాలా మంది తారలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ చాలా మంది పెళ్లి పీటలెక్కారు. అయితే కొంతమంది హీరో హీరోయిన్స్ వయసు దాటి పోతున్న పెళ్లి జోలికి వెళ్లడం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారు చాలా మంది ఉన్నారు.

మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
Actress

Updated on: Jan 17, 2025 | 7:20 PM

సినిమా సెలబ్రెటీలు సినిమాలతోనే కాదు తమ వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొంతమంది యంగ్ బ్యూటీస్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. మరికొంతమంది వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు పాన్ ఇండియా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మరికొంతమంది డేటింగ్స్ తో గడిపేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం పెళ్లి అనే ఆలోచనలేకుండా గడిపేస్తున్నారు. వయసు పెరుగుతున్నా కూడా పెళ్లి, ప్రేమ అనేది లేకుండా తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయారు.

ఇది కూడా చదవండి : పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

అలాగే ఓ స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. ఐదుపదుల వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తుంది. తన వయ్యారాలతో కుర్ర హీరోయిన్స్ ను కూడా అవాక్ అయ్యేలా చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో టబు ఒకరు.  వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

ఆతర్వాత నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి,అందరివాడు,షాక్, ఇదీ సంగతి, పాండురంగడు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ వయసు 50ఏళ్లకు పైనే.. ఇప్పటికీ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. టబు ఇప్పటికీ హిందీలో సినిమాలు చేస్తున్నారు టబు. వైవాహిక జీవితమే ఓ మనిషి లైఫ్‌ను డిసైడ్ చేయదు. నా లైఫ్ గురించి వేరే వాళ్లు జడ్జ్ చేయడం ఇష్టం ఉండదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. టబు మాట్లాడుతూ.. పెళ్లిపై ఆసక్తి లేదని, ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. సింగిల్ గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా.. ఇప్పటికీ కెరియర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని టబు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి