ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన హీరోలలో తరుణ్. అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, అదృష్టం వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి అలనాటి హీరోయిన్ రోజా రమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతుందని అన్నారు. “తరుణ్ రోజూ గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం అభిమానుల ఆశిస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది ఏది లేదు. అది ఎలాగో అవుతుంది.
అలాగే తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక వెబ్ సిరీస్‌తోపాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను. అందరి ఆశిస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను” అని అన్నారు. అయితే తరుణ్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.