
ప్రముఖ నటి రోజా ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. అయినా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారామె. ఇదిలా ఉంటే రోజా బాటలోనే ఆమె కూతురు అన్షు మాలిక కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓప్రముఖ బ్యానర్‌తో అన్షు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అన్షు మాలిక సినీ రంగ ప్రవేశంపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లోకి రాకుండానే అవార్డుల మీద అవార్డులు గెల్చుకుంటోంది అన్షు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తోంది రోజా కూతురు. అంతేకాదు రైటర్‌గా కూడా సత్తా చాటుతోంది. తన మల్టీ ట్యాలెంటెతో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటోంది. ఈ అమ్మడు విదేశాల్లో ఉంటుంది. అక్కడనుంచి రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది.
త్వరలోనే ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తాజాగా అన్షు షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. క్యూట్ ఫొటోలతో పాటు గ్లామరస్ ఫోటోలు పంచుకుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.