Actress Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మగా.. అత్తగా.. పిన్నిగా.. వదినగా… ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. కేవలం నటనలోనే కాకుండా.. డ్యాన్స్‌లోనూ తన సత్తా ఎంటో చూపిస్తుంది ప్రగతి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రగతికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రగతి జిమ్ వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అందులో చెమటలు కక్కుతూ ప్రగతి వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.
ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే ప్రగతి.. గతేడాది లాక్డౌన్ సమయంలో తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా జిమ్‌లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తుంది. ఇక రీసెంట్గా ఈ సీనియర్ నటి.. ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో నయా బెల్లి వర్కవుట్ చేసి తన అభిమానులకు చూపించారు. అందరూ ట్రెడ్మిల్ పై రన్నింగ్ జాగింగ్ చేస్తే.. యాక్టరస్ ప్రగతి మాత్రం రివర్స్‌లో చేతులతో నడుస్తూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రగతి ఈ వీడియోతో నెట్టింట వైరల్ అయ్యారు. ఇది చూసిన నెటిజన్లు.. బిగ్‌బాస్ కోసమే ఇన్ని వర్కవుట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
Gopichand: సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..
Narappa Trailer: మరోసారి విశ్వరూపం చూపించిన వెంకటేశ్.. “నారప్ప” ట్రైలర్ అదుర్స్..
Dia Mirza: మే నెలలో కొడుకు.. రెండు నెలలుగా ఐసీయూలోనే.. తన కుమారుడి పేరును చెప్పిన దియా మీర్జా..