Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..
Jayanthi

Updated on: Jul 26, 2021 | 10:12 AM

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేటి ఉదయం కన్నుమూశారు. సీనియర్ హీరోలు నాగేశ్వరరావు , ఎన్టీఆర్, కృష్ణ నటించిన చాలా సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో ఆమె హీరోలకు తల్లిగా నటించింది.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి హీరోలకు తల్లిగా నటించి అలరించారు జయంతి. మోహన్ బాబు నటించిన పెద్దరాయుడు సినిమాలో రజినీకాంత్ చెల్లిగా నటించి ఆకట్టుకున్నారు ఆమె. ఇక కన్నడనాట జయంతి నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణించారు. అక్కడ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి అగ్ర నటుల సినిమాల్లో హీరోయిన్‌‌‌గా నటించి మెప్పించారు. ఇక జయంతి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా జయంతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

Hero Vijay: ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం