Silk Smitha : డబ్బు కట్టలపై నిద్రపోయింది.. సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం అతడే.. అసలు విషయం చెప్పిన డిస్కో శాంతి..

ప్రముఖ సీనియర్ నటి డిస్కో శాంతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దివంగత నటి సిల్క్ స్మిత జీవితం, ఆమె మరణం వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. అప్పట్లో సిల్క్ స్మిత మరణంపై చిత్ర పరిశ్రమలోనూ, సమాజంలోనూ ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. వాటన్నిటిపై డిస్కో శాంతి క్లారిటీ ఇచ్చారు.

Silk Smitha : డబ్బు కట్టలపై నిద్రపోయింది.. సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం అతడే.. అసలు విషయం చెప్పిన డిస్కో శాంతి..
Silk Smitha

Updated on: May 21, 2026 | 9:30 PM

80, 90వ దశకాల్లో సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమను తన గ్లామర్ మరియు నటనతో శాసించిన నటి సిల్క్ స్మిత. ఆమె మరణం సంభవించి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ ఆమె జీవితం , మరణం వెనుక ఉన్న కారణాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే సిల్క్ స్మితతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తామిద్దరూ కలిసి కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో నటించామని, ఆ సమయంలో స్మిత తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేదని చెప్పారు. అప్పట్లోనే స్మిత రోజుకు ఒక లక్ష నుండి రెండు, మూడు లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకునేదని తెలిపారు. “ఆ రోజుల్లో మేము లక్ష రూపాయలు చూడటమే కష్టంగా ఉండేది, కానీ స్మిత రోజుకు లక్షలు సంపాదించేది. తను సంపాదించిన డబ్బునంతా బెడ్‌పై వేసి, దానిపై బెడ్‌షీట్ పరిచి పడుకునేదాన్ని అని నాతో స్వయంగా చెప్పింది” అని శాంతి గుర్తుచేసుకున్నారు. స్మిత చెన్నైలో దాదాపు నెలకు 5 లక్షల రూపాయల భారీ అద్దె ఇంట్లో ఎంతో లగ్జరీగా, రాణిలా బతికిందని ఆమె పేర్కొన్నారు. సిల్క్ స్మిత మరణం – ఆ క్షణంలో జరిగిన ఆవేదనస్మిత మరణవార్త విన్నప్పుడు తాను బాంబేలో ఉన్నానని, ఆ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..

స్మితకు మానసిక సమస్యలు లేదా అనారోగ్యం ఏమీ లేవని, ఆమె ఎంతో మంచి మనసున్న అమ్మాయి అని అన్నారు. అయితే, ఎవరైనా వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఒకే ఒక్క క్షణంలో వస్తుందని, ఆ ఒక్క క్షణంలోనే ఆమె ఆ తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటుందని శాంతి తెలిపారు. షూటింగ్‌లలో నిర్మాతలు, దర్శకులు కూడా స్మిత దగ్గరకు వెళ్లి మాట్లాడటానికి భయపడేంత మర్యాద, గౌరవం ఆమెకు ఉండేవని తెలిపారు. డాన్స్ స్టైల్ , వ్యక్తిగత జ్ఞాపకాలుసిల్క్ స్మిత, అనురాధ, తాను ముగ్గురిలో అనురాధే ఎక్కువగా డాన్స్ చేసేదని, స్మితకు అంతగా డాన్స్ రాకపోయినా ఆమెలో ఉన్న గ్రేస్, స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేవని శాంతి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‏లో ట్రెండింగ్..

స్మిత ఎప్పుడూ షూటింగ్‌కు వచ్చేటప్పుడు తన కోసం చాక్లెట్లు, బబుల్‌గమ్స్ తీసుకువచ్చేదని ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇండస్ట్రీలో స్మిత గురించి తప్పుడు ప్రచారాలు చాలా జరిగాయని, కానీ వ్యక్తిగతంగా ఆమె ఎంతో సున్నితమైన, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని డిస్కో శాంతి ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..

 

ఎక్కువ మంది చదివినవి : Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..

Follow Us