Mahesh Babu: మహేష్ బాబు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వెయిటింగ్.. ఎవరెవరంటే..

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Mahesh Babu: మహేష్ బాబు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వెయిటింగ్.. ఎవరెవరంటే..
Mahesh Babu

Updated on: Jun 01, 2025 | 7:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియాట్ అయ్యాయి. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు రాజమౌళి. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్‌ అడవుల నేథ్యంలో అడ్వెంచరస్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రియాంకా షూటింగ్ లోనూ జాయిన్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ముగ్గురు దర్శకులు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నారని టాక్. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. యానిమల్ సినిమా కథను ముందుగా మహేష్ కోసం అనుకున్నాడు వంగ.. కానీ అది రణబీర్ కు వెళ్ళింది. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనిలో పడనున్నాడు సందీప్. వీరితో పాటు నాగ్ అశ్విన్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.