
కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు.. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈరోజు ఉదయం జిమ్లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు..
పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి.ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. పునీత్ మృతి శాండిల్ వుడ్ను షాక్కు గురి చేసింది. సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గరయింది. పునీత్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డేడ్బాడీని బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించారు. పునీత్ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్లు చేశారు. ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.