Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar Hospitalized: పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన డాక్టర్స్.. ఏమన్నారంటే..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఈరోజు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఉదయం జిమ్‏లో వ్యాయమం

Puneeth Rajkumar Hospitalized: పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన డాక్టర్స్.. ఏమన్నారంటే..
Puneeth Raj Kumar Hospitali
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2021 | 1:45 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఈరోజు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పునీత్‏కు గుండెపోటు వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.. అనంతరం పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

తాజాగా పునీత్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు స్పందించారు.. పునీత్‏ను ఉదయం 11 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి రాకముందే ఆయన ప్రైవేట్ క్లినిక్‏లో చికిత్స తీసుకున్నారని తెలిపారు.. ప్రస్తుతం పునీత్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని చెప్పారు. మరో అర్ధగంటలో ఆయన ఆరోగ్య పరిస్థితి పై పూర్తి అప్డేట్ ఇవ్వనున్నట్లుగా తెలిపారు..ఇప్పటికే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూసివేశారు.. అటు పునీత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఎదుట.. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: Gundu Kalyanam: దాదాపు 750 సినిమాల్లో నటించిన హాస్య నటుడు.. నేడు ఆర్ధిక ఇబ్బందులతో చికిత్స కోసం ఎదురుచూపులు

Puneeth Rajkumar Hospitalized: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‏కు గుండెపోటు.. బెంగుళూరులోని ఆసుపత్రిలో చేరిక..

Anchor Anasuya: మంత్రి కేటీఆర్ సర్.. నాకో డౌట్ అంటూ ట్వీట్ చేసిన అనసూయ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..