ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సమంత పేరు ఎక్కువగా ఉంటుంది. సామ్‌కు సంబంధించిన వార్త నిత్యం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత అనుహ్యంగా ఆ బంధానికి స్వస్తి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో సామ్ పేరు మారుమోగిపోతుంది. సమంత ఏం చేసిన.. ఎక్కడికి వెళ్లినా.. ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సామ్.. పలు ఆసక్తికర పోస్ట్స్ చేస్తుండడంతో.. ప్రస్తుతం సామ్… ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది స్పష్టం అవుతుంది. విడాకుల బాధ నుంచి కోలుకునేందుకు సామ్ తెగ ప్రయత్నిస్తున్నట్లుగా తన పోస్ట్స్ చూస్తే అర్థమవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టిందని.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా సమంత మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పలు కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది సామ్. దీంతో ఇలా కోట్స్ రూపంలో తన మానసిక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఇటీవల గుర్తుపెట్టుకోంది. తొందర్లోనే గుడ్ న్యూస్ రాబోతుందంటూ పోస్ట్ చేసింది సామ్. దీంతో ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇక తాజాగా సామ్ తన ఇన్‌స్టా ఖాతాలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ” ఇతరులు చేసిన పనిని నువ్వు చేయాల్సిన అవసరం లేదు.. నీ జీవితానికి ఏది ముఖ్యమో ఆ పని చేయు” ..అంటూ సద్గురు వ్యాఖ్యలను పోస్ట్ చేసింది సామ్.