Samantha: ఫుల్ స్వింగ్ లో సమంత.. తాజాగా క్రిప్టో కరెన్సీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సామ్‌

|

Jan 26, 2022 | 2:57 PM

Samantha-Cryptocurrency: విడాకుల ప్రకటన తర్వాత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన సమంత (Samantha )తనదైన స్టయిల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్,..

Samantha: ఫుల్ స్వింగ్ లో సమంత.. తాజాగా క్రిప్టో కరెన్సీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సామ్‌
Samantha Promotes Cryptocurrency
Follow us on

Samantha-Cryptocurrency: విడాకుల ప్రకటన తర్వాత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన సమంత (Samantha )తనదైన స్టయిల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటుంది. మరోవైపు తన స్టార్‌ ఇమేజ్‌తో గ్లోబల్‌ ఇమేజ్‌ దిశగా అడుగులు వేస్తున్న స‌మంత పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఊపెస్తోన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు సామ్ తన బిజినెస్‌ని కూడా విస్తరించే పనిలో పడింది. వ్యాపార పరంగా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. తాజాగా కాయిన్‌స్విచ్‌ కుబేర్ క్రిప్టో(Cryptocurrency) యాప్‌కు ప్రచారకర్తగా సమంత మారారు. చిన్న‌ మొత్తాలతో ఇన్వెస్ట్‌ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చ‌ని తెలిపే వీడియోను సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేసారు. ఇప్పటికే ఆర్బన్‌ కిసాన్‌, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన సమంత ఇప్పడు క్రిప్టో కరెన్సీ అంబాసిడర్‌గా మారారు.

పలు క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారారు. తాజాగా సమంత కూడా వచ్చి ఈ లిస్ట్లో చేరారు. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ స‌మంత చేస్తున్న ప్ర‌చారం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాయిన్‌స్విచ్‌కుబేర్‌ క్రిప్టోపై ఇన్వెస్ట్‌ చేయడం ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసినట్లు అంటూ షేర్‌ చేసిన వీడియోలో పేర్కొన్నారు. కేవలం 100 రూపాయల నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్‌ చేయవచ్చునని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై ఏవైనా సందేహాలు ఉంటే కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వీడియోలో తెలిపింది.

Also Read:   చిన్నారి కాదు చిచ్చరపిడుగు.. ఆన్ లైన్ లో లక్షల విలువజేసే ఫర్నిచర్ ఆర్డర్.. షాక్ తిన్న తల్లిదండ్రులు..