చైతూతో విడాకుల అనంతరం సమంత ఎప్పుడూ బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. చెయ్ జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడేందుకు ట్రై చేస్తోంది. ప్రజంట్ వరస సినిమాలను ఒప్పుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఇంట్రస్టింగ్ కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తుంది. మై మామ్స్ సెడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే ప్రస్తుతం తన మానసిక పరిస్థితిని ఇలా కోట్స్ రూపంలో ఆమె తెలియజేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. త్వరలో ఏదో మంచి జరగబోతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అని పేర్కొంది.
విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని నెటిజన్లు రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారు. ఆమె ఎటువంటి పోస్ట్ పెట్టినా.. స్టేటస్ పెట్టినా ఇట్టే వైరల్ చేస్తున్నారు. తాజా పోస్ట్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది. కాగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తయి.. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Also Read: సుమక్క సినిమా కష్టాలు.. ‘జయమ్మ పంచాయితీ’ కోసం తగ్గేదే లే…
తునాతునకలైన లారీ.. చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు